publisherbbp@gmail.com
పుడమి మీద ఒకే మతం,ఒకే దేవుడు ఉన్న రోజులవి. భరత ఖండానికి పడమర దిక్కున దూరంగా సముద్ర తీరాన ఒక పెద్ద భూభాగం. ఈ భూభాగంలో ఎన్నో రాజ్యాలు. వాటిలో ఏడు రాజ్యాలు చాలా పెద్దవి. ఈ రాజ్యాలు చాలా సమృద్ధంగా ఉండేవి. ఎటువంటి కొరత ఉండేవి కావు. ఈ ఆరు పెద్ద రాజ్యాలు ఎప్పుడు ఒకరికంటే, ఒకరు గొప్పవాళ్లమని, బలవంతులమని చెప్పుకుంటుంటారు . అయితే ఇదంతా మాటల్లోనే తప్ప ఒకరిమీద ఒకరు యుద్దానికి దిగే వాళ్ళు కాదు. నిజంగా యుద్ధం జరిగితే గెలిచినా ఓడినా ఎవరు మళ్ళీ కోలుకోలేరు. కానీ ఒక రాజ్యం ఆ ఆరు రాజ్యాల మీద ఆధిపత్యం గా ఉండేది. దాని పేరు ప్రతరిత్వా.
దాన్ని పాలించే మహారాజు ఆదేశ్వర కర్ణ. చాలా సున్నితమైన మనస్సు, సంస్కారం కలవాడు. మనిషి చూడడానికి తెల్లగా ఉండక పోయినా కంటిలో మెరుపు కనిపించేది. గడ్డం ఎప్పుడు శుభ్రంగా ఉంచుకునేవాడు. ఇంకా తల వెనుక భాగాన 7 అంగుళాల వెంట్రుకలు పెంచుకుని ఒక పిలక వేసుకునేవాడు. వేషధారణ కూడా సాదా సీదాగా ఉండేది. అతని పేరును సూచించినట్లుగా చిన్నతనం నుంచే అన్నింటా ముందు ఉండేవాడు. అతనికి 25 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అతను ఆ రాజ్యానికి మహారాజు అయ్యాడు. రాజ్యంలో అందరినీ గౌరవంగా, ఆప్యాయంగా పలకరించేవాడు.రాజ్యంలో తాను చూసిన , విన్న సమస్యలన్నింటినీ పరిష్కరించేవాడు. రాజ్యాన్ని కైవసం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న క్షణం నుంచి ఇప్పటి వరకు ఆ రాజ్య రాజధాని నగరంలో ఉన్న మనుషులు, వారి ప్రవర్తన, రాజకీయాలు అర్థం కాలేదు. రాజ్యాన్ని చేతుల్లోకి తీసుకున్న మూడేళ్ల తర్వాత ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు శుశ్రుత. ఆమె ఒక రకమైన మనిషి, కానీ చాలా మంచిది. పెళ్లయిన ఏడాది తర్వాత వారికి ఒక కొడుకు పుట్టాడు. వారసుడు పుట్టాడన్న సంతోషం లేకుండా, బిడ్డ పుట్టినప్పటి నుంచి 10 రోజులపాటు వాన, భూకంపాల వల్ల రాజ్యంలో, గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజలు మరణించారు. వ్యాపారాల్లో నష్టాలు వచ్చాయి. పుట్టిన రోజు కూడా అమావాస్య,ఏకాదశి రెండు తిదుల మధ్య ఎవరు జన్మించని సమయం కావడంతో అతని పుట్టుక నగరంలో ఉన్న అందరికీ భయాన్ని కలిగించింది.
ఆదేశ్వర రాజ్యంలో ఉన్న యోగులు, సాధువులు, ఋషులు, సిద్ధులందరినీ అతని కోటకు ఆహ్వానించారు. అక్కడ బస చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జరిగినదంతా చెబుతూ, అతని కుమారుని జననానికి, దీనికి ఏమైనా సంబంధం ఉందా?? అని అడిగాడు. బిడ్డ పుట్టిన సమయం, నక్షత్రం చూసి అక్కడే ఉండి ఇలా జరగడానికి గల కారణాలను తెలుసుకోవడం ప్రారంభించారు. ఆ రోజు గడిచింది.